హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ

WGL: గీసుగొండ మండలం కొనయమాకుల గ్రామంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 37 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్లు శనివారం పంపిణీ చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.