హైదరాబాద్: 28°C
తెలంగాణ

వీరేష్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలి: సీపీఎం

GDWL: వీరేష్ మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిపై హత్య కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.