హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ పండుగ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

SDPT: హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. చెరువుల కట్ట వద్ద బతుకమ్మ ఘాట్, ఇతర ప్రాంతాల్లో చెరువు వైపు లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఫాల్గొన్నారు.