హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైనారిటీస్ సంక్షేమ అధికారిగా జలాలొద్దీన్ అక్బర్

KNR: జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారిగా మహమ్మద్ జలాలొద్దీన్ అక్బర్ నియమితులయ్యారు. ఈ నెల 16న ఆయన పూర్తి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అదనపు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మైనారిటీల సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.