హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

​జనసేన అభ్యర్థిగా తోట రాజరాజేశ్వరి ఖరారు

PLD: చిలకలూరిపేట మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా జనసేన సమన్వయకర్త తోట రాజా రమేష్ సతీమణి తోట రాజరాజేశ్వరి పేరు ఖరారైంది. ఈ నేపథ్యంలో రాజా రమేష్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ప్రక్రియలో కూటమి సహకారం, పట్టణాభివృద్ధిపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా పుల్లారావు వారికి పూర్తి మద్దతు ప్రకటించారు.