హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూలు ఎన్నికలకు ఇద్దరు అబ్జర్వర్ల నియామకం

కర్నూలు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇద్దరు అబ్జర్వర్లను నియమించింది. జనరల్ అబ్జర్వర్‌గా బి.శ్రీనివాసరావు ఐఏఎస్, ఎన్నికల వ్యయ పరిశీలకుడిగా కె.బాలరాజు ఐఎఫ్‌ఎస్‌ను నియమించినట్లు కలెక్టర్ ఏ.సిరి శనివారం తెలిపారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.