హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శనేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా తైలాభిషేకాలు

కోనసీమ: కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శనేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వేకువ జాము నుంచి స్వామివారికి తైలాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు భక్తులు సమర్పించిన విరాళాలు, వివిధ సేవలు ద్వారా రూ.2.20 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఈవో దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు.