హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

NGKL: జిల్లా కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వయం సహాయక మహిళా సంఘాల భాగస్వామ్యంతో శనివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అ. కలెక్టర్ బి. చెన్నయ్యతో పాటు జిల్లా అధికారులు, మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాల సభ్యులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. కలెక్టరేట్‌లో పండుగ వాతావరణం నెలకొంది.