HYD: గాంధీ ఆస్పత్రిలోని లీగల్ ఎయిడ్ క్లినిక్ను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, సీనియర్ సివిల్ జడ్జి శాలిని సందర్శించారు. ఈ సందర్భంగా రోగులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సీనియర్ సిటిజన్లకు అందుతున్న వైద్య సేవలు, ఆస్పత్రిలోని సదుపాయాలను పరిశీలించారు. ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఎదురైతే ప్రతి శనివారం క్లినిక్ను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
గాంధీ ఆస్పత్రిలో లీగల్ ఎయిడ్ క్లినిక్ తనిఖీ


