MDK: నర్సాపూర్ మండలం లింగాపూర్ సబ్ స్టేషన్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధామల్లేష్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 9 గంటల విద్యుత్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించి 18 గంటల ఉచిత విద్యుత్ అందించాలని డిమాండ్ చేస్తూ ఏడీకి వినతిపత్రం ఇచ్చారు.
తెలంగాణ
18 గంటల విద్యుత్ ఇవ్వాలని డిమాండ్


