ASF: సిర్పూర్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. మండలంలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి గ్రామ సర్పంచ్ భీంరావు, సోహెల్, సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్సీ విఠల్ సమక్షంలో కాంగ్రెస్లోకి చేరికలు


