హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండవ రోజు 50 నామినేషన్ దాఖలు

ప్రకాశం: గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల రెండవ రోజు శనివారం నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. మొత్తం 50 నామినేషన్ దరఖాస్తులు అందినట్లు సహాయ ఎన్నికల అధికారి రమణబాబు తెలిపారు. వైసీపీ నుంచి 27, టీడీపీ నుంచి 17, జనసేన నుంచి 2, ఇండిపెండెంట్లుగా 4 దరఖాస్తులు వచ్చాయి. వైసీపీ తరపున ఛైర్మన్ పదవికి ఒక దరఖాస్తు కూడా అందినట్లు అధికారులు వెల్లడించారు.