హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేన కమిటీ పెద్దలను కలిసిన మేయర్ అభ్యర్థి

కృష్ణా: మచిలీపట్నం కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ ఆబిదా బేగం, షేక్ హసీం బేగ్ దంపతులు ఇవాళ మచిలీపట్నంలో జనసేన పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థానిక సంస్థల సమన్వయకర్తలు మండలి వెంకట్రామ్, బండి రామకృష్ణ, చిలకలపూడి పాపారావులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిటీ పెద్దలు వారికి శుభాకాంక్షలు తెలియజేసి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.