హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్వోబీ పనులు త్వరగా పూర్తి చేయాలి

NZB: నిజామాబాద్‌ నగరంలోని అర్సపల్లిలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని నగర అభివృద్ధి కమిటీ శనివారం డిమాండ్‌ చేసింది. పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.అధికారులు స్పందించి నిర్మాణ పనులను వేగవంతం చేసి,వీలైనంత త్వరగా బ్రిడ్జిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరింది.