హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీటి కేటాయింపులో ఒక్క టీఎంసీ తగ్గినా ఒప్పుకోం... CPM

NLG: డిండి, పాలమూరు ,రంగారెడ్డి ప్రాజెక్టుల నీటి కేటాయింపుల్లో మార్పులను అంగీకరించబోమని సీపీఎం జిల్లా కార్యదర్శి వీరారెడ్డి స్పష్టం చేశారు.నార్లపురం నుంచి నీటి తరలింపు ప్రతిపాదనలను ఖండించారు. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించడమే డిండి ప్రాజెక్టు లక్ష్యమన్నారు. జిల్లాకు అన్యాయం జరిగితే రైతులు, ప్రజలతో కలిసి ప్రత్యక్ష పోరాటాలు చేస్తామన్నారు.