NLG: కట్టంగూర్ మండలంలోని పందెనపల్లి గ్రామ యాదవ సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. గ్రామంలో 100కు పైగా కుటుంబాలకు సంఘ భవనం లేక సమావేశాలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని నాయకులు ప్రభుత్వ విప్,ఎమ్మెల్యే వేముల వీరేశం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి నిధులు మంజూరు చేయడంతో సంఘం నాయకులు ఆయనను కలిసి శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ
సంఘం కమ్యూనిటీ హాల్కు నిధులు మంజూరు


