పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా ముందుగా పాలమూరుకు నీళ్లందించిన తర్వాతే డిండి ప్రాజెక్టుకు తరలించాలని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏదుల నుంచి డిండికి నీటి తరలింపు ప్రతిపాదనను అంగీకరించబోమన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోసం తల అయినా నరుక్కుంటా కానీ.. పాలమూరు ప్రయోజనాల కోసం ఆయనతోనైనా పోరాడతానని స్పష్టం చేశారు.
తెలంగాణ
పాలమూరు నీళ్లకు పోరాడతా: ఎమ్మెల్యే


