ASF: ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఈ నెల 23న నిర్వహించనున్న అమరవీరుడు కొమురం భీం విగ్రహావిష్కరణ మహోత్సవానికి హాజరుకావాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిని నిర్వాహకులు శనివారం ఆహ్వానించారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన కొమురం భీం ఆశయాలు, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
కొమురం భీం విగ్రహావిష్కరణకు ఎమ్మెల్యేకి ఆహ్వానం


