హైదరాబాద్: 28°C
తెలంగాణ

జోగాపూర్ లో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న విప్

SRCL: చందుర్తి మండలం జోగాపూర్ శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండపంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.