హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 18 వరకు నామినేషన్ల స్వీకరణ

ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాల ఎన్నికలకు నామినేషన్లను ఈ నెల 18 వరకు స్వీకరిస్తారని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. 19న పరిశీలన, 21న ఉపసంహరణ గడువు ముగిశాక అదే రోజు తుది జాబితా విడుదల చేస్తారు. 28న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయి. పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు.