హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉపాధి హామీ పనులతో కూలీలకు ఉపాధి

NLG: ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని కూలీలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని దామరచర్ల ఎంపీడీవో వెంకటయ్య తెలిపారు. మండలంలోని కేజేఆర్‌ కాలనీ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పనులను సర్పంచ్‌ ధనావత్‌ సిద్ధు నాయక్‌తో కలిసి ఆయన పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పనులపై అవగాహన కల్పించడంతోపాటు గ్రామ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.