MDK: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చని ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రపంచ ట్రామా దినోత్సవం సందర్భంగా హెల్మెట్, సీట్బెల్ట్ ప్రాధాన్యాన్ని వివరించారు. అతివేగం, మద్యం, సెల్ఫోన్ డ్రైవింగ్ వద్దని హితవు పలికారు. గోల్డెన్ అవర్లో బాధితులకు వైద్య సాయం అందించి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
ప్రమాద బాధితులను మానవత్వంతో కాపాడాలి: ఎస్పీ


