MLG: వెంకటాపురం మండలం వీరభద్రవరంలో గ్రామ సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ నాయకులు పంచాయతీ కార్యదర్శి స్వరూపకు శనివారం వినతిపత్రం అందజేశారు. వీధి దీపాలు, తాగునీరు, డ్రైనేజీ శుభ్రత, చెత్త తొలగింపు, దోమల నివారణ, రహదారుల మరమ్మతులు చేపట్టాలని కోరారు. బతుకమ్మ పండుగ సందర్భంగా గద్దెల వద్ద పరిశుభ్రత, లైటింగ్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
'వీరభద్రవరంలో మౌలిక వసతులు కల్పించాలి'


