హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పొన్నూరులో CMRF చెక్కుల పంపిణీ

GNTR: పొన్నూరులో అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి CMRF చెక్కులను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అందజేశారు. పొన్నూరు మండలానికి చెందిన 28 మందికి రూ.13.21 లక్షలు, పట్టణానికి చెందిన 13 మందికి రూ.6.57 లక్షలు పంపిణీ చేశారు. మొత్తం 41 మంది బాధితులకు ఈ సాయం అందింది. ఆపత్కాలంలో ఆదుకున్న ప్రభుత్వానికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.