హైదరాబాద్: 28°C
తెలంగాణ

అరుదైన సర్జరీతో యువకుడికి పునర్జన్మ

HYD: గాంధీ ఆసుపత్రి వైద్యులు భూపాలపల్లికి చెందిన 20 ఏళ్ల సందీప్‌కు అరుదైన శ్వాసనాళ శస్త్రచికిత్సను ఉచితంగా నిర్వహించి ప్రాణాలు కాపాడారు. 90 నుంచి 95 శాతం వరకు మూసుకుపోయిన శ్వాసనాళంలో సుమారు 4 సెంటీమీటర్ల భాగాన్ని తొలగించి విజయవంతంగా చికిత్స అందించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో రూ.7–8 లక్షలు ఖర్చయ్యే ఈ సర్జరీని గాంధీ వైద్యులు ఉచితంగా నిర్వహించారు.