హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవాని భక్తులు విజయవాడకు పాదయాత్ర

AKP: నక్కపల్లి మండలం దొండవాకలో జై దుర్గ భవానీ పీఠం ఆధ్వర్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి దర్శనానికి భవాని మాలలు ధరించిన భక్తులు పాదయాత్ర ప్రారంభించారు. భవానీలు, గ్రామ పెద్దలు, భక్తులు అమ్మవారి నామస్మరణ చేస్తూ ‘దుర్గమ్మ తల్లీ శరణం.. శరణం’ అంటూ భక్తిశ్రద్ధలతో పాదయాత్రలో పాల్గొన్నారు.