KNR: సైదాపూర్ మండలం సోమారం గ్రామ శివారులో వ్యవసాయ బావి వద్ద శనివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అక్రమంగా పేలుడు పదార్థాలు కలిగి ఉన్న రామడుగు మండలం శ్రీరాములపల్లెకు చెందిన వేముల భూమయ్య (45) ను అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 475 జిలెటిన్ స్టిక్స్, సుమారు 3 వేల మీటర్ల డిటోనేటింగ్ వైర్, రెండు కంప్రెసర్ ట్రాక్టర్లను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ
సోమారంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు


