హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు.. అప్రమత్తతే రక్షణ: SP

ADB: ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ శనివారం సూచించారు. జిల్లాలో గత వారంలో 24 సైబర్ ఫిర్యాదులు నమోదైనట్లు పేర్కొన్నారు. యూపీఐ, క్రెడిట్ కార్డు, ఆన్‌లైన్ ఉద్యోగాల పేరుతో మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కి లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.