MDK: నర్సాపూర్లో ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర విషాదం నింపింది. అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది బాధితులను ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
తెలంగాణ
ఫుడ్ పాయిజన్ బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ


