హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లె దవాఖానాలను పరిశీలించిన BJYM బృందం.!

KMM: గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల తీరును తెలుసుకునేందుకు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పల్లె దవాఖానాలను బీజేపీ యువమోర్చా ప్రతినిధులు పరిశీలించారు. కేంద్ర నిధులతో ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ యువమోర్చా నాయకుడు ససనాల శ్రీరామ్‌తో పాటు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.