హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు: MLA

ADB: జైనద్ మండలంలోని బెల్లూరి గ్రామంలో రూ.15 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ శనివారం భూమిపూజ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవీణ్ రెడ్డి, నాయకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.