హైదరాబాద్: 28°C
క్రీడలు

వారి వైఫల్యం వల్లే భువీ రీఎంట్రీ: మాజీ కోచ్

యువ బౌలర్లు విఫలమవ్వడం వల్లే భువనేశ్వర్ కుమార్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నారని మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ తెలిపాడు. కుర్రాళ్లు రాణించి ఉంటే భువీ అవసరం జట్టుకు ఉండేది కాదన్నాడు. దేశంలో ప్రతిభ ఉన్నా, అంతర్జాతీయ ఒత్తిడిని తట్టుకోవడంలో యువ బౌలర్ల విఫలమవుతున్నారని తెలిపాడు. యువ పేసర్లను సరిగ్గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.