BPT: స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బాపట్ల జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ బీ. ఉమామహేశ్వర్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా సభలు, ఊరేగింపులు, రోడ్షోలు, మైకులు లేదా డ్రోన్లు వినియోగిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆయుధాలు ధరించడం, గుమిగూడడం నిషేధమని తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రజలు సహకరించాలనీ కోరారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు


