E.G: వాహన్, సారథి పోర్టల్ల ద్వారా రవాణా శాఖకు చెందిన 86 సేవలు ఆన్ లైన్లో అందుబాటులో ఉన్నాయని తూ.గో జిల్లా రవాణా శాఖాధికారి ఆర్. సురేష్ తెలిపారు. వాహన బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, చిరునామా మార్పు వంటి సేవలను ఇంటి నుంచే పొందవచ్చన్నారు. సాంకేతిక నవీకరణలో కారణంగా కొన్ని సేవలకు అక్టోబర్ 14 నుంచి కార్యాలయంలో ఆఫ్ లైన్ దరఖాస్తులకు అవకాశం కల్పించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆన్ లైన్లో 86 సేవలు... జిల్లా రవాణా అధికారి


