BHNR: వలిగొండలో ఆత్మీయ భారతి సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో పదో తరగతి తెలుగులో అధిక మార్కులు సాధించిన విద్యార్థులు ఉషశ్రీ, టీనా, ఐశ్వర్య, ఉత్తేజ్, భానుశంకర్లను ఘనంగా సత్కరించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి రెబ్బ మల్లికార్జున్ మెమొంటోలు, శాలువాలు కప్పి, పుస్తకాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, విజయ్ బాబు, బండి రవి, మణి పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సత్కారం


