హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీరు నిల్వ ఉండకుండా చూడాలి: కమిషనర్

MBNR: సీజనల్ వ్యాధుల నివారణకు ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జడ్చర్ల మున్సిపల్ కమిషనర్ సూచించారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, నీటి ట్యాంకులకు మూతలు పెట్టాలని, కాలువలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. దోమల నివారణ చర్యలు చేపట్టాలని తెలిపారు. జ్వర లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.