KMR: బిక్కనూర్ మండలంలో ఈ నెల 22 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వే నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి హేమీమా తెలిపారు. శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలకు అవగాహన సమావేశం నిర్వహించారు. శరీరంపై అనుమానాస్పద మచ్చలు ఉన్నవారి వివరాలు సేకరించి, వ్యాధి నిర్ధారణకు సహకరించాలని సూచించారు.
తెలంగాణ
ఈనెల 22 నుంచి కుష్టు వ్యాధి నిర్ధారణ సర్వే


