హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలమూరు ప్రయోజనాలే ముఖ్యం: అనిరుధ్ రెడ్డి

MBNR: పాలమూరు నీళ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. జడ్చర్లలో ఆయన మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన రాజకీయ గురువని, ఆయన కోసం ప్రాణాలైనా ఇస్తానని అన్నారు. అయితే పాలమూరు నీళ్లను ఇతర ప్రాంతాలకు తరలిస్తే సహించబోనని స్పష్టం చేశారు. ప్రాంత ప్రయోజనాలే తనకు ముఖ్యమని పేర్కొన్నారు.