KNR: కరీంనగర్ రూరల్ మండలం నగునూరులోని శ్రీదుర్గాభవానీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏడో రోజు శనివారం అమ్మవారు ఇంద్రాణీ అలంకరణలో గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు, హారతులు నిర్వహించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం దీక్షాదారులు, భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు.
తెలంగాణ
VIDEO: ఇంద్రాణీ అలంకరణలో దుర్గాభవానీ అమ్మవారు


