హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలం వద్ద 10 అడుగులకు గోదావరి

BDK: భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం అక్టోబరులోనే గణనీయంగా తగ్గడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. శనివారం నాటికి నీటిమట్టం 10 అడుగులకు పడిపోయింది. గతంలో ఇదే సమయంలో 20 నుంచి 30 అడుగుల వరకు నీరు ఉండేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకు చేరడంతో రానున్న వేసవిలో నీటి పరిస్థితులు ఎలా ఉంటాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.