హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు'

కోనసీమ: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల పరిశీలనాధికారి పి. ప్రశాంతి ఆదేశించారు. శనివారం అమలాపురం గోదావరి భవన్‌లో ప్రిసైడింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియను నిష్పక్షపాతంగా, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు.