హైదరాబాద్: 28°C
తెలంగాణ

త్వరలో మరో విడత ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే

BDK: పినపాక మండల కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక తరలింపులో పేదలకు ఇబ్బందులు కలిగించవద్దని అధికారులకు సూచించారు. ఇసుక రవాణాను అడ్డుకుంటూ లబ్ధిదారులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. త్వరలోనే మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నట్లు తెలిపారు.