హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంటాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రంలో 68 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ దసరా కానుకగా పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఈ పథకాలు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.