హైదరాబాద్: 28°C
వ్యాపారం

ఈ నెల 24 వరకు ఎయిరిండియా విమానాలు రద్దు

సౌదీ, హౌతీల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. సౌదీలోని పలు విమానాశ్రయాలపై హౌతీలు దాడులు చేస్తున్న నేపథ్యంలో ఎయిరిండియా కీలక నిర్ణయం తీసుకుంది. సౌదీకి వెళ్లే ఎయిరిండియా విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ నెల 24 వరకు విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు చెప్పింది. జెడ్డా, రియాద్, దమ్మామ్‌కు సర్వీసులను నిలిపివేసినట్లు వెల్లడించింది.