హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆరుగురికి నియామక పత్రాలు అందజేసిన కలెక్టర్

NRML: కారుణ్య నియామకాల కింద జిల్లాలో ఆరుగురికి ఉద్యోగాలు కల్పించినట్లు కలెక్టర్ కె.హరిత తెలిపారు. శనివారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్‌లతో కలిసి నియామక పత్రాలు అందజేశారు. వీరిలో ముగ్గురికి జూనియర్ అసిస్టెంట్లుగా, మరో ముగ్గురికి కార్యాలయ సబార్డినేట్లుగా వివిధ శాఖల్లో పోస్టింగ్‌లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.