హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

పల్నాడు జిల్లా జొన్నలగడ్డలోని తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కృతిక శుక్లా పరిశీలించారు. సిబ్బంది కేటాయింపు, వాహనాల రాకపోకల మార్గాలు, బారికేడింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత తదితర అంశాలను ఆమె సమీక్షించారు.