భారత పురుషుల క్రికెట్ జట్టు సీనియర్ సెలెక్టర్ పదవికి మాజీ ఓపెనర్ వసీం జాఫర్ దరఖాస్తు చేసుకున్నాడు. అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ను పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించడంతో ఖాళీ అయిన ఈ పదవికి తాను పోటీలో ఉన్నట్లు జాఫర్ వెల్లడించాడు. భారత్ తరఫున 31 టెస్టులు ఆడిన అతడు, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 19,410 పరుగులు, 57 సెంచరీలతో అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు.
క్రీడలు
భారత మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం..!


