హైదరాబాద్: 28°C
తెలంగాణ

వంగపహాడ్ పీఏసీఎస్ ఛైర్మన్‌గా అనిల్‌రెడ్డి

HNK: హసన్ పర్తి మండలం వంగపహాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) చైర్మన్‌గా నియమితులైన అనిల్‌రెడ్డి ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజును శనివారం హనుమకొండలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అనిల్‌రెడ్డి, కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమం, సహకార సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.