హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

HYD: దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 6 గంటల నుంచే అమ్మవారిని దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారికి ఓడిబియాలు సమర్పించడంతో పాటు కుంకుమ పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.