హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి పెట్టాలి'

AKP: ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో శాంతిభద్రతల పరిరక్షణ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై జీఎంఎస్‌కే సిబ్బంది, పోలీసులతో కోటవురట్ల ఎస్సై విజయ్ కుమార్ సమావేశం నిర్వహించారు. గ్రామాలను సంబంధిత జీఎస్ఎంకేలు దత్తత తీసుకుని, ఆయా ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చూడాలన్నారు.